calender_icon.png 26 December, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం

26-12-2025 12:59:14 PM

బంక్‌లోనే తగలబడ్డ వ్యాన్

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నోజిగూడలోని భారత్ పెట్రోల్ బంక్‌లో(Bharat Petrol Bunk) అగ్నిప్రమాదం జరిగింది. పెట్రోల్ బంకులో వ్యానులో డీజిల్ పోస్తుండగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు అంటుకుని మారుతీ వ్యాన్ పూర్తిగా కాలిపోయింది. వ్యాను డ్రైవర్, పెట్రోల్ బంక్ సిబ్బంది సురక్షితంగా తప్పించుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది