అంధేరిలో భారీ అగ్నిప్రమాదం
03-01-2026 03:43 PM
ముంబై: అంధేరి పశ్చిమ శివారులో ఉన్న 18 అంతస్తుల నివాస భవనంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం(Fire breaks out) సంభవించిందని పౌర అధికారులు తెలిపారు. అంధేరీ సబ్‌వే ఎదురుగా ఉన్న ఎస్వీ రోడ్డులోని చండివాలా పెర్ల్ రీజెన్సీలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఒక పౌర అధికారి మాట్లాడుతూ, భవనం మొదటి అంతస్తులోని ఎలక్ట్రిక్ డక్ట్‌లో మంటలు చెలరేగి, ఆ డక్ట్ ద్వారా 10వ అంతస్తు వరకు వ్యాపించాయని, దీనివల్ల ఆ ప్రాంగణంలో దట్టమైన పొగ అలుముకుందని తెలిపారు. భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనక గురయ్యారు.




