29 July, 2026 | 10:36 PM

గురువుల ను సన్మానించిన అమ్ము స్వచ్ఛంద సంస్థ

29-07-2026 10:00 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): గురుపౌర్ణమి సందర్బంగా కరీంనగర్ పట్టణంలోని అమ్ము స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలు బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు డాక్టర్ పి. సుజాత రెడ్డి తన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సుజాత రెడ్డి మాట్లాడుతూ తల్లి తండ్రుల తరువాత విద్యా బుద్దులు నేర్పిన గురువే మన జీవితాలకు ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సవేరా శ్రీలత, గోవింద్ రావు, జనార్దన్ రెడ్డి, ఉమేష్ గుప్తా గార్లకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అజయ్ విష్ణు వెంకటేష్ వర్ధన్ శ్రీమతి లలిత తదితరులు పాల్గొన్నారు.