29 July, 2026 | 10:36 PM

నల్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

29-07-2026 10:01 PM

సిర్గాపూర్ జులై 29(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టును ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి బుధవారం పరిశీలించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు, గేట్ల పరిస్థితి, సాగునీటి పంపిణీ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు అభివృద్ధికి అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.