29 July, 2026 | 10:47 PM

అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లవద్దు

29-07-2026 10:09 PM

- చెన్నూర్ సీఐ బన్సీలాల్

చెన్నూర్,(విజయక్రాంతి): జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, అత్యవసరమైతే తప్పా ప్రజలెవరు బయటకు వెళ్లకుండా  ఇండ్లలోనే ఉండాలని చెన్నూర్ పట్టణ సిఐ బన్సీలాల్ కోరారు. ఎడతెరిపి లేని వర్షం వల్ల  శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలిపోయే ప్రమాదం పొంచి ఉందని, అలాంటి ఇండ్లలో ఉండకూడదన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయంలో తమ సేవలను వినియోగించుకోవాలన్నారు. ఉధృతంగా  ప్రవహిస్తున్న శివలింగపూర్, అక్కెపల్లి వాగు ప్రవాహాన్ని తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపిడిఓ తో కలిసి పరిశీలించారు. ప్రమాద స్థాయిలో వాగు ప్రవహిస్తున్నందున ప్రజలెవరు రాకపోకలు సాగించకుండ బారీకేడ్లు ఏర్పాటు  చేశారు.