అదుపుతప్పి కారు బోల్తా
29-07-2026 10:04 PM
కొండపాక: కొండపాక మండలం రవీంద్ర నగర్ రాజీవ్ రహదారిపై కారు బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సిద్దిపేట పట్టణానికి చెందిన అశోక్(50) లహరి (32) ప్రసాద్(38) ఒకే కుటుంబానికి చెందినవారు. హైదరాబాదులో వారి బంధువులు చనిపోతే వెళ్లి తిరిగి సిద్దిపేటకు వస్తుండగా కొండపాక ఎక్స్ రోడ్ రవీంద్రా నగర్ రాజివ్ రహదారి పై కారు అదుపుతప్పి బోల్తా పడిందని తెలిపారు. కారులో ఉన్న ముగ్గురికి గాయాలు అయినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని గాయాలైన వారిని అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు.






