29 July, 2026 | 10:45 PM

మద్యం మత్తులో అతివేగంగా వచ్చి వ్యక్తిని ఢీకొట్టిన కారు వ్యక్తి వృత్తి

29-07-2026 10:07 PM

శామీర్ పేట్,(విజయక్రాంతి): మద్యం తాగిన ఓ వ్యక్తి అర్ధరాత్రి అమితవేగంతో కారుతో ఎక్సల్ పై వెళ్తున్న వ్యక్తి ని ఢీ కొట్టడంతో వ్యక్తి వృత్తి చెందిన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం.... అనంతారం గ్రామానికి చెందిన షేక్ జమీల్(61) మంగళవారం రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో తన టీవీఎస్ ఎక్స్ ల్  వాహనంపై కిరాణా దుకాణానికి వెళ్లి సామాన్లు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు.

ఇంటికి కొద్ది దూరంలోకి చేరుకోగానే, క్షీరసాగరం నుంచి లక్ష్మాపూర్ కి చెందిన కావలి మల్లేష్ మద్యం మత్తులో తన కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా రాంగూట్లో నడుపుతూ వచ్చి జమీల్ వాహనాన్ని బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో జమీల్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స కోసం ఆర్వీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మృతి చెందాడు.మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శామీర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.