జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు
17-04-2026 09:31 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): కేంద్ర మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించిన ప్రతిష్టాత్మక బ్రోంజ్ డిస్క్ అవార్డులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిమందిని ఎంపికచేసింది. కాగా అందులో హుజూర్ నగర్ ఫైర్ ఫైటర్ జుట్టుకొండ వెంకటేశ్వర్లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. సూర్యాపేట జిల్లా కీతవారిగూడెం గ్రామానికి చెందిన జుట్టుకొండ వెంకటేశ్వర్లు విది నిర్వహణలో చూపిన ధైర్య సాహసాలకు ఈ జాతీయ స్థాయి పురస్కారం లభించింది ఈ సందర్భంగా హుజూర్ నగర్ ఫైర్ ఆఫీసర్ పశ్యా సుబ్బిరాంరెడ్డి, సిబ్బంది, కీతవారిగూడెం గ్రామ పెద్దలు పలువురు ఆయనను అభినందించారు.






