17 April, 2026 | 10:44 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు

17-04-2026 09:34 PM

* ఏడుపాయల్లో వీధి దీపాలు లేక చీకటిమయం

* భయాందోళనకు గురవుతున్న భక్తులు

పాపన్నపేట: దేశంలోనే రెండో వన దుర్గామాత ఆలయంగా.. జనమేజయుని సరుపయోగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గామాత ఆలయం ప్రధాన కూడల్లు అంధకారం అలుముకున్నాయి. దీంతో వనదుర్గమ్మ భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఓవైపు అడవి, చుట్టూ చీకటి అలుముకోవడంతో ఎటు నుంచి ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. మహిళా భక్తులకు దొంగల భయం చుట్టుకుంది. ఇళ్ల మధ్య, ప్రధాన కూడల్ల వద్దే బైకులపై వచ్చి మెడలో బంగారు గొలుసులు దొంగలిస్తున్నారని.. అలాంటిది ఏడుపాయల్లోని ప్రదేశంలో మహిళా భక్తుల పరిస్థితి ఏంటని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.