నాగర్‌కర్నూల్‌లో అగ్నిప్రమాదం

23-04-2024 01:46:06 AM

వీధి విక్రయిదారుల దుకాణాలు దగ్ధం

రూ.లక్షల్లో నష్టం

నాగర్ కర్నూల్, ఏప్రిల్ -22 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీపురం చౌరస్తా నుంచి ప్రధాన రహదారి పక్కన ఉన్న పలు దుకాణాలు దగ్ధమయ్యాయి. దుకాణాలు దగ్ధమవడంతో లక్షల రూపాయల విలువచేసే వస్తువులు మంటల్లో కాలిపోవడంతో ఆయా దుకాణదారులు బోరుమన్నారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ అదే సమయంలో తాడూరు మండల కేంద్రంలోనూఅగ్నిప్రమాదం సంభవించిందన్నారు. ఫైరింజన్ వచ్చేలోగా కండ్లముందే దుకాణాలన్నీ ఖాళీ బూడిదయ్యాయని బాధితులు వాపోయారు.- ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.