15 May, 2026 | 9:58 AM

వక్ఫ్‌బోర్డ్ ఆస్తులు అన్యాక్రాంతం

23-04-2024 01:47 AM

బీఆర్‌ఎస్ నేత రాకేశ్ కుమార్

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో వక్ఫ్‌బోర్డు ఆస్తులను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర జరుగుతోందని, నాంపల్లిలో ఉన్న పెద్ద భవనాన్ని ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా కట్టబెట్టారని బీఆర్‌ఎస్ నాయకులు చిరుమళ్ల రాకేశ్ కుమార్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మాట్లాడుతూ.. ముస్లిం అనాథ పిల్లల కోసం కేసీఆర్ నిర్మించిన అనీస్ ఉల్ గుర్బాను కాంగ్రెస్ ప్రభుత్వం వేరే అవసరాలకు వినియోగించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

 కేవలం రూ.5లకే గజం లీజుకు ఇచ్చారని, మైనార్టీ విద్యాసంస్థలకు అనీస్ ఉల్ గుర్బా ప్రాంగణాన్ని తరలించాల్సిన అవసరం లేదన్నారు. నిజాం కాలం నుంచి దీనికి ఒక చరిత్ర ఉందని, దాని ప్రాధాన్యం గుర్తించి అనాథల కోసమే ఆ భవనం కేటాయించాలని, లీజును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం కొత్త నిర్మాణాలు చేపట్టకపోయినా ఫర్వాలేదు కాని కేసీఆర్ కట్టినవి దొంగల వశం చేయవద్దని సూచించారు. ప్రభుత్వ గురుకులాల్లో కలుషిత ఆహారం పెడుతున్నారన్నారు.