21 July, 2026 | 7:30 PM

Breaking News

జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •   ఇల్లందు–బొమ్మనపల్లి ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత   •  

‘తుపాకులతో కాల్చండి.. బుల్లెట్ల వర్షం కురిపించండి’

27-08-2024 01:28 AM
  • ఫాతిమా ఓవైసీ కాలేజీని కూల్చొద్దు n విద్యావ్యాప్తికి చేస్తున్న కృషికి అడ్డుపడకండి: ఎమ్మెల్యే అక్బరుద్దీన్

 చార్మినార్,ఆగస్టు 26(విజయక్రాంతి): హైడ్రా రాజకీయ దుమారం రేపుతుంది. చెరువులను కబ్జా చేసిన వారిపై ఉక్కుపాదం మోపుతుంటే మరోపక్క మజ్లిస్ పార్టీ ఒవైసీ బ్రదర్స్ దూకుడు పెంచారు. “నాపై బుల్లెట్ల వర్షం కురిపించండి. తుపాకులతో కాల్చండి. కత్తులతో చంపండి. కానీ అంకితభావంతో విద్యావ్యాప్తికి చేస్తు న్న కృషికి అడ్డుపడకండి. ఫాతిమా ఓవైసీ కాలేజీని కూల్చొద్దు ” అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. సాలార్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్  కోర్సు ల్లో శిక్షణతో పాటు కంప్యూటర్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్‌లో శిక్షణ పొందిన మహిళలకు బండ్లగూడలోని బారిస్టర్ ఫాతిమా ఒవైసీ కేజీ టూ పీజీ క్యాంపస్‌లో ఆదివారం సర్టిఫికెట్లను ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా అక్బరుద్దీన్  మాట్లాడుతూపేద విద్యార్థుల భవిష్యత్ కోసం ఇప్పటి వరకు 12 భవనాలను నిర్మిచామన్నారు. కొందరు కావాలనే కుట్రపూరి తంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. “నేను బలహీనంగా ఉన్నట్లు భావించోద్దు. శత్రువులను ఓడించే శక్తి నాకు ఉంది. గతంలో కూడా నాపై దాడి జరిగింది. కత్తులతో నరికినా..తుపాకులతో కాల్చినా విద్యాభివృద్ధికి కృషి చేస్తాను. ఓ విద్యా వ్యవస్థను కూల్చుతారా” అంటూ ఆయన ప్రశ్నించారు. భవిష్యత్‌లో మరిన్ని భవనాలు నిర్మిస్తామన్నారు.