28 July, 2026 | 4:01 PM

బెయిల్ పొడిగించండి

28-05-2024 12:05 AM

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్

న్యూఢిల్లీ, మే 27: ఢిల్లీ లిక్కర్ కేసులో తనకు మంజూరు చేసిన బెయిల్‌ను మరో ఏడురోజులు పొడిగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. తనకు తీవ్ర అనారోగ్యం ఉన్నదని, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉన్నదని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకొనేందుకు వీలుగా కేజ్రీవాల్‌కు కోర్టు జూన్ 1వ తేదీవరకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాను ఏడు కేజీలు బరువు తగ్గిపోయాయని పీఈటీ స్కాన్ తదితర పరీక్షలు చేయించుకోవాల్సి ఉన్నందున బెయిల్ పొడిగించాలని ఆయన కోర్టును కోరారు.