02-12-2025 10:45:07 PM
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికారెడ్డి, బిందుమాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో ఈ సినిమాను లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ‘పిల్లా..’ అనే పాట రిలీజైంది. ‘దండోరా కొట్టుకుందురో గుండెల్లో కొత్తగుందిరో.. నింగీనేల ఇలా దారి కుదిరిందెలా కళ్లారా చూడబోతినో కల్లోలంలాగ ఉంటదే.. దాగిదాగి అలా దగ్గరైపోయావే ఇలా.. పిల్లా ఇట్టసూడవే.. తొంగి నన్ను చూడవే..’ అంటూ సాగుతోందీ గీతం. మార్క్ కే రాబిన్ సంగీతం అందించిన ఈ పాటను పూర్ణా చారి రాశారు. అదితి భావరాజు, అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్ శాఖమూరి; ఎడిటర్: సృజన అడుసుమిల్లి; ఆర్ట్: క్రాంత్రి ప్రియం.