14 August, 2026 | 10:27 PM

చెరువుకు గండి.. చేపలు మృతి

14-08-2026 09:23 PM

బెజ్జంకి: బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామ శివారులోని తుమ్మల చెరువుకు గండి పడటంతో సుమారు రూ.2 లక్షల విలువైన చేపలు మృతి చెందినట్లు ముదిరాజ్ మత్స్యకారులు తెలిపారు. చెరువులో పెంచుతున్న చేపలు నీటి మట్టం తగ్గడంతో మృతి చెందాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రామసాగరం సర్పంచ్, ఉపసర్పంచ్‌పై బెజ్జంకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు అధికారులను కోరారు.