15 June, 2026 | 11:42 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

వలకు చిక్కుకొని మత్స్యకారుడి మృతి

24-03-2026 12:01 AM

కేసముద్రం, మార్చి 23 (విజయక్రాంతి): చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు వలకు చిక్కుకొని దుర్మరణం పాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణ పల్లి వట్టివాగులో చోటు చేసుకుంది. కేసముద్రం ఎస్‌ఐ క్రాంతి కిరణ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ పట్టణంలోని హనుమంతుని గడ్డ కు చెందిన అలువాల సాయిబాబా (29) ప్రతిరోజు చేపలు పట్టి అమ్మి జీవించేవాడు.

రోజులాగానే ఆదివారం మధ్యాహ్నం 3.౩౦  గంట లకు అర్పణ పల్లి శివారులోని పట్టి వాగు ఏరు లో వలతో  చేపలు పట్టడానికి వెళ్లి వస్తానని తన భార్య ఉమకు చెప్పి మహబూబాబాద్  నుంచి బయలుదేరి అర్పణ పల్లి శివారులోని వట్టివాగువీరులు చేపలు పట్టడానికి వలను  వేయగా ప్రమాదవశాత్తు వ ల  అతని కాళ్లకు చుట్టుకొని నీటిలో మునిగిపోయి చనిపోయాడన్నారు. మృతునికి కూతురు కారుణ్య కొడుకు కౌశిక్ ఉన్నారు. మృతుడి భార్య ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టినట్లు ఎస్ ఐ తెలిపారు.