24 March, 2026 | 1:25 AM

మధ్యాహ్న భోజనంలో పురుగులు, రాళ్లు

24-03-2026 12:00 AM

నిర్మల్, మార్చి 23(విజయక్రాంతి): నిర్మల్ మండలంలోని కడ్తాల్ జెడ్‌పిహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం అన్నంలో పురుగులు కనిపించాయి. విద్యార్థులు భోజనం చేస్తుండగా ఓ విద్యార్థికి పురుగు కనిపించడంతో ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ కు తెలిపారు.

అక్కడ చేరుకున్న సర్పంచ్ వార్డు సభ్యులు మధ్యాహ్న భోజనం పరిశీలించగా పురుగులు రావడం వారు అక్కడే భోంచేస్తుండగా అన్నంలో చిన్న చిన్న రాళ్లు వచ్చాయి. వెంటనే డిఈఓ కు సమాచారం ఇవ్వగా దర్శనం భోజన అక్కడికి చేరుకొని విచారణ జరిపారు. పలుమార్లు విద్యార్థులు ఫిర్యాదు చేసినప్పటికీ ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడం వలన ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు