16-10-2025 02:13:51 AM
-ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాం తి): రాష్ట్రంలో నేటి నుంచి ఐ దు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ప లు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు సైతం వీస్తాయని తెలిపింది.
గురువారం నిజామాబాద్, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం నిజామాబాద్, ఖ మ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమ కొండ, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తాయని తెలిపింది. సోమవారం వరకు రా ష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురువనున్నాయి.