calender_icon.png 16 October, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూలో విప్లవాత్మక సంస్కరణలు

16-10-2025 02:12:42 AM

 మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : రాష్ర్టంలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మకమైన సం స్కరణలను చేపట్టామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. డిప్యూటీ కలెక్టర్ ల నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందిన 13 మంది బుధవారం సచివాలయంలో ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని, అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని అ న్నారు. సాదా బైనామాల దరఖాస్తుల పరిష్కారానికి భూభారతి చ ట్టంలో స్పష్టమైన నిబంధనలను రూపొందించామని, వాటి దరఖాస్తులను వీలైనంత త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

గత ప్రభుత్వంలో సాదా బైనామాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించారు కానీ 2020 ఆర్వోఆర్ చట్టంలో పరిష్కారం చూపించలేదని చెప్పారు. ఫలితంగా 9.26 లక్షల దరఖాస్తులు పరిష్కారం కాకుండా పోయాయని మంత్రి అన్నారు. దీనిపై కొంత మంది హై కోర్టును ఆశ్రయించగా స్టే విధించిందని, ఈ కోర్టు స్టేను  ఇటీవల తొలగించామని వివరించారు. పదోన్నతులు పొందినవారు ప్రజలతో మమే కమై రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని మంత్రి కోరారు. 

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యం

త్వరలో అక్రిడిటేషన్ పాలసీ : మంత్రి పొంగులేటి

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని రాష్ర్ట రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత్రికేయుల కోసం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన జర్నలిస్టులకు  అందేలా విధివిధానాలను రూపొందిస్తున్నామని తెలిపా రు.

బుధవారం సచివాలయంలో  మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్  ప్రియాంక, సీపీఆర్వో మల్సూర్ తో కలిసి అక్రిడిటేషన్ పాలసీపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టుల గౌరవాన్ని కాపాడేవిధంగా శాస్త్రీయ పద్ధతిలో అక్రిడిటేషన్ పాలసీ ఉండాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయడానికి ఈనెల చివరినాటికి పాలసీ విధివిధానాలను కొలిక్కి తీసుకురావాలని సూచించారు.