calender_icon.png 16 October, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్‌-1 నియామకాలపై హైకోర్టులో విచారణ

16-10-2025 02:15:35 AM

- నవంబర్ 18 కి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి ): గ్రూప్ 1 నియామకాలపై టీజీపీ ఎస్సీ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. గత విచారణ లో గ్రూప్ 1 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పు ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసిన అనంతరం విచారణ వాయిదే వేసింది. ప్రతివా దులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

కౌంటర్ దాఖలుపై బుధ వారం జస్టిస్ ఆపరేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ప్రతివాదు లు రిట్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు సమయం కోరగా నవంబర్ 18కి విచారణ వాయిదా వేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ వరకు డివిజ న్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది.