3 September, 2026 | 9:47 AM

పోలవరంలో తీవ్ర విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి

18-07-2026 | 02:09pm

పోలవరం: పోలవరం జిల్లా(Polavaram District) ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో( Godavari River) గల్లంతైన ఐదుగురు గిరిజనుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులున్నారని పోలీసులు వెల్లడించారు. మృతులను గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. చేపలు పట్టే క్రమంలో గోదావారిలో లోతుగా ఉన్న ప్రాంతంలోకి దిగి గల్లంతై జలసమాది అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం  నిమిత్తం మార్చురీకి తరలించారు.