3 September, 2026 | 10:10 AM

భారత్ సహా ప్రపంచ దేశాలకు అమెరికా వార్నింగ్

03-09-2026 | 09:07am

మోదీ-పెజిష్కియన్ భేటీపై అమెరికా నజర్

న్యూఢిల్లీ: భారత్-ఇరాన్ భేటీపై(India-Iran Meeting) అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌ను కలిసిన నేపథ్యంలో ఇరాన్‌కు ఆయుధాలు(Weapons) సమకూర్చుకోవడంలో గానీ, అమెరికా ఆంక్షలను తప్పించుకోవడంలో గానీ సహాయం చేయవద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో(US Secretary of State Marco Rubio) భారత్‌ తో సహా ఇతర దేశాలను హెచ్చరించారు. పెజెష్కియన్‌తో ప్రధాని సమావేశం గురించి, అలాగే టెహ్రాన్‌తో కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి న్యూఢిల్లీ ప్రయత్నిస్తోందా? అనే విషయంపై 'ది బ్రయాన్ కిల్మీడ్ షో'లో బ్రయాన్ కిల్మీడ్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కు సాయం చేసే ఏదేశాలనూ వదలబోమని అమెరికా తేల్చిచెప్పింది.

మోదీ -పెజెష్కియన్ భేటీపై(Modi-Pezeshkian Meeting) అమెరికా ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ లో వాణిజ్యాన్ని విస్తరించాలని భారత్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా మంత్రి రూబియో(Marco Rubio) వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రభుత్వం ఇరాన్‌పై తన ఆర్థిక ప్రచారాన్ని తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. టెహ్రాన్‌తో వ్యాపారం కొనసాగించే దేశాలు, కంపెనీలు ద్వితీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆగస్టు 24న అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్(US Treasury Secretary Scott Bessent), ఇరాన్‌కు మిగిలి ఉన్న ఆర్థిక జీవనాధారాలను అడ్డుకోవడానికి "ఆర్థిక డి-డే"గా అభివర్ణిస్తూ, "ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్" అని పిలిచే దానిని ప్రారంభించారు.