3 September, 2026 | 11:26 AM

భారత్‌ను ఆదుకున్న ప్రవాస భారతీయులు

03-09-2026 | 09:27am

భారత్ కు డాలర్ల వెల్లువ

3 నెలల్లోనే 100 బిలియన్ డాలర్లుపైగా జమ

ఆర్‌బీఐకి మరింత బలం

ముంబై: భారత్ పై డాలర్ల(Dollars) వర్షం కురుస్తోంది. భారత్ సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రవాస భారతీయులు(Non-Resident Indians (NRIs)) ఆదుకున్నారు. ఆర్బీఐ(Reserve Bank of India) వ్యూహాత్మక ఎత్తుగడతో భారీగా విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ బ్యాంక్(Foreign Currency Non-Resident Bank) డిపాజిట్ల ప్రవాహం కొనసాగుతోంది. మూడు నెలల్లోనే 127 బిలియన్ డాలర్ల జమ కావడం కరెన్సీకి మద్దతునిచ్చే కేంద్ర బ్యాంక్ సామర్థ్యం బలపడింది. ప్రవాస భారతీయులు విదేశాల్లో సంపాదించిన డాలర్లును భారత బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు.

మూడు నెలల్లోనే డిపాజిట్లు అంచనాలను మించాయి. ఎన్ఆర్ఐ(NRIs)ల డాలర్లతో విదేశీ మారకం ఖజానా భారీగా పెరిగిపోయింది. ఫారెక్స్ నిల్వలు ఏకంగా 729 బిలియన్ డాలర్లకు  చేరాయి. క్రూడ్ ఆయిల్ ధరల సెగతో డాలర్ విలువ తగ్గి ఎన్ఆర్ఐల డిపాజిట్లతో(NRI deposits) మళ్లీ జోష్ పెరిగింది. రూపాయి విలువ పడిపోతున్న తరుణంలో ఎన్ఆర్ఐ డాలర్లు భారత్ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చాయని విశ్లేషకులు తెలిపారు. ఆర్థిక ఒత్తిడి సమయంలో ఎన్ఆర్ఐ డాలర్లు మరోసారి భారత్ కు అండగా నిలబడ్డాయి. దీని ఫలితంగా గురువారం నాడు భారత రూపాయి(Indian Rupee) తన ఇటీవలి పురోగతిని మరింత కొనసాగించనుంది.