గంజాయి డాన్ ఇంట్లో ఈడీ సోదాలు
03-09-2026 | 09:39am
హైదరాబాద్: గంజాయి డాన్ నీతూబాయి ఇంట్లో ఈడీ సోదాలు(Enforcement Directorate) చేస్తోంది. ఈడీ అధికారులు తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఎనిమిది చోట్ల సోదాలు చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ(Excise Department) నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ సోదాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గంజాయి అమ్మకాలతో నీతూబాయి రూ. కోట్లు సంపాదించినట్లు ఈడీ ఆరోపించింది. హవాలా రూపంలో డబ్బులు సంపాదించినట్లు ఈడీ(ED) గుర్తించింది. నీతూబాయికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తులపై ఈడీ దృష్టి సారించింది.






