10 May, 2026 | 9:05 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

గోదావరిలో ఐదుగురు గల్లంతు

27-02-2025 02:32 AM
  1. తూర్పు గోదావరి తాడిపూడి మండలంలో ఘటన
  2. మహాశివరాత్రి పర్వదినాన విషాదం

తాళ్లపూడి: తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండల కేంద్రంలో విషా దం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లిన వారిలో ఐదుగురు గల్లంతయ్యారు. శివరాత్రి పురస్కరించుకొని బుధవారం తెల్లవారుజామున 11 మంది యువకులు గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నది లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించడంలో విఫలం కావడంతో ఐదుగురు యువకులు నీటిలో మునిగిపోయా రు.

ఈ క్రమంలో ఒకరినొకరు రక్షించుకునే క్రమంలో వారంతా గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గత ఈతగాళ్ల సాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు పవన్ (17), దుర్గాప్రసాద్ (19), సాయి కృష్ణ (19), పవన్ (19), ఆకాశ్ (19)గా గుర్తించారు. వీరంతా కొవ్వూరు, తాళ్లపూడి, రాజమహేంద్రవరంలో ఇంటర్, డిగ్రీ చదువుతున్నా రు. యువకులంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో విషాదచాయలు అలుముకున్నాయి.