కొత్తగా ఐదుగురు ‘సుప్రీం’ న్యాయమూర్తులు
న్యూఢిల్లీ, జూన్ 1: దేశ అత్యున్నత న్యా యస్థానంలో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమించినట్టు కేంద్ర న్యాయ శాఖ ప్రకటించింది. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈ నియామకాలు ఖరారయ్యాయి. నూతనంగా బా ధ్యతలు చేపట్టనున్న వారిలో నలుగురు వివి ధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా, మరొకరు సుప్రీం కోర్టు సీని యర్ న్యాయవాది.
కేంద్ర న్యాయశాఖ విడుదల చేసిన అధికారిక జాబితా ప్రకారం.. సు ప్రీంకోర్టు న్యాయమూర్తులు గా పదోన్నతి పొందిన వారిలో జస్టిస్ చంద్రశేఖర్ (బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ షీల్ నాగు (పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ్ (మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ అరుణ్ పళ్లి (జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి), సుప్రీం కోర్టుకు చెందిన ప్రముఖ సీనియర్ మహిళా న్యాయవాది వి.మోహన ఉన్నారు.






