పశ్చిమ బంగాల్‌లో మంత్రివర్గ విస్తరణ
- 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
- ఏడుగురు మహిళలకు మంత్రివర్గంలో చోటు
- మొత్తంగా.. 4౦ మంత్రులతో జంబో క్యాబినెట్
కోల్‌కతా, జూన్ ౧: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి మంత్రివర్గంలో కొత్తగా 35 మంది మంత్రులు చేరా రు. కోల్‌కతాలోని లోక్‌భవన్‌లో గవర్నర్ ఆర్‌ఎన్ రవి సోమవారం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో 8 మందికి క్యాబినెట్ హోదా దక్కింది. ముగ్గురు మం త్రులుగా స్వతంత్ర బాధ్యతలు చేపట్టారు.
మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో స్వాపన్ దాస్‌గుప్తా, తపస్ రాయ్, అర్జున్ సింగ్, శంకర్ ఘోష్, దీపక్ బర్మ న్, మనోజ్ కుమార్ ఒరాన్, గౌరీ శంకర్ ఘోష్, జగన్నాథ్ ఛ టోపాధ్యాయ ఉన్నా రు. మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు చోటు లభించింది.
వీరిలో కలితా మాఝీ నేపథ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ఆమె నెలకు రూ.2,500 కోసం ఇళ్లలో పనిమనిషిగా జీవనం సాగించే వారు. బీజేపీలో ఒక సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థా నం ప్రారంభించి మంత్రి స్థాయికి ఎదగడం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. తాజా విస్తరణతో మొత్తం గామంత్రివర్గంలో సభ్యుల సంఖ్య 40కి చేరింది.






