3 March, 2026 | 5:10 AM

యుద్ధ జ్వాలలు

03-03-2026 01:45 AM

ఖమేనీ మృతికి ఇరాన్ ప్రతీకార దాడులు

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ-2

  1. కువైట్, దుబాయ్, సౌదీ, అబుదాబి, దోహాపై దాడులు ఉధృతం
  2. రణరంగంగా మారిన పశ్చిమాసియా
  3. సౌదీలోని చమురుశుద్ధి కేంద్రంపై డ్రోన్లు.. 
  4. ఒమన్ తీరంలో నౌకపై దాడి.. భారతీయుడు మృతి
  5. చికిత్స పొందుతూ ఖమేనీ సతీమణి మృతి

నెతన్యాహు ఆఫీసుపై దాడి చేశాం: ఇరాన్.. కొట్టిపారేసిన ఇజ్రాయెల్ 

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు: 31 మంది మృతి

పెరిగిన చమురు, గ్యాస్ ధరలు.. స్టాక్ మార్కెట్లు పతనం

ఇరాన్ అహంకారం వల్లే యుద్ధం: అమెరికా 

చర్చల్లేవ్..  యుద్ధాన్ని మేమే ముగిస్తాం: ఇరాన్ 

పశ్చిమాసియాలో యుద్ధం ఆపే ప్రసక్తే లేదని, యుద్ధాన్ని ఎవరు ప్రారంభించినప్పటికీ, తాము ముగింపు పలుకుతామని సోమవారం ఇరాన్ తేల్చిచెప్పింది. అమెరికాపై ‘జిహాద్’ చేస్తామని ఆ దేశ మత పెద్దలు ప్రకటించారు. తమ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ఇరాన్ ప్రతీకార దాడులు ముమ్మరం చేసింది. సౌదీ, కువైట్, దుబాయ్, అబుదాబి, దోహా, మనామా నగరాలపై విరుచుకుపడింది.

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రమైన సౌదీ అరేబియా ‘రాస్ తనూరా’పై ఇరాన్ రెండు డ్రోన్లతో దాడి చేసింది. ఒమన్ తీరంలో ఒక నౌకపై జరిపిన దాడిలో ఒక భారతీయ నావికుడు మృతిచెందాడు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 555 మంది ఇరాన్ ప్రజలు మరణించారు. మరోవైపు, ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. ఇరాన్, లెబనాన్‌ను టార్గెట్ చేసి పెద్దఎత్తున దాడులు చేసింది. లెబనాన్‌లోని హెజుబుల్లా కేంద్రాన్ని పేల్చివేసింది. పేలుళ్లలో ౩౧ మంది మృతిచెందారని తెలిపింది.

పశ్చిమాసియా రణరంగం

* తమ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ఇరాన్ ప్రతీకారం

* సౌదీలోని చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్లు.. నిలిచిన ఉత్పత్తి

కువైట్, దుబాయ్, సౌదీ, అబుదాబి, దోహాపై దాడులు ఉధృతం

ఒమన్ తీరంలో నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి

చికిత్స పొందుతూ ఖమేనీ సతీమణి మన్సూరే ఖోజస్తే మృతి

నెతన్యాహు కార్యాయలంపై దాడి చేశామన్న ఇరాన్

దాడులను కొట్టిపారేసిన ఇజ్రాయెల్ 

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి

అంతర్జాతీయ మార్కెట్లపై యుద్ధ ప్రభావం 

పెరిగిన చమురు, గ్యాస్ ధరలు.. పడిపోయిన స్టాక్ మార్కెట్లు

టెహ్రాన్/ టెలిఅవీవ్/ వాషింగ్టన్, మార్చి ౨: ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో మధ్యప్రాచ్యం రణరంగమైంది. యుద్ధం క్రమంగా గల్ఫ్ దేశాలకూ పాకింది. దాడులు, ప్రతిదాడులతో ఆయా దేశాలు అట్టుడికిపోతున్నాయి. తమ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నది. ఇదే దాడిలో గాయాల పాలై సతీమణి మన్సూరే ఖోజస్తే (౭౯) మృతిచెందడం కూడా ఇరాన్‌ను కలచివేసింది. సోమవారం ఈ మేరకు సౌదీ, కువైట్, దుబాయ్, అబుదాబి, దోహా, మనామా నగరాలపై ఉధృతంగా దాడులు చేసింది.

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రమైన సౌదీ అరేబియా ‘రాస్ తనూరా’పై ఇరాన్ రెండు డ్రోన్లతో దాడి చేసింది. ఫలితంగా చమురు శుద్ధి నిలిచింది. ఒమన్ తీరంలో ఒక నౌకపై జరిపిన దాడిలో ఒక భారతీయ నావికుడు మృతిచెందాడు. యుద్ధంలో మరణించిన మొదటి భారతీయుడు ఈ నావికుడే. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 555 మంది ఇరాన్ ప్రజలు మరణించారు.

యుద్ధం ఆపే ప్రసక్తే లేదని, చర్చలకు తావే లేదని, యుద్ధాన్ని ఎవరూ ప్రారంభించినప్పటికీ, తాము ముగి ంపు పలుకుతామని ఇరాన్ తేల్చిచెప్పింది. అమెరికాపై ‘జిహాద్’ (పవిత్ర యుద్ధం) చేస్తామని ఆ దేశ మత పెద్దలు ప్రకటించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయంపై తాము దాడి చేశామని ఇరాన్ చెబుతుండగా, దాడే జరగలేదని నెతన్యాహు కొట్టిపడేశారు. మరోవైపు, ఇజ్రాయెల్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఇరాన్, లెబనాన్‌ను టార్గెట్ చేసి పెద్ద ఎత్తున దాడులు చేసింది. లెబనాన్‌లోని హెజుబుల్లా కేంద్రాన్ని పేల్చివేసింది. పేలుళ్లలో ౩౧ మంది మృతిచెందారని, వారిలో పలువురు ఉగ్రవాదులు ఉన్నారని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇరాన్ అంతమే తమ లక్ష్యమని ఆ దేశ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. కేవలం అహంకారం వల్లే యుద్ధం వచ్చిందని అమెరికా ప్రకటించింది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ఆగబోదని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.

అమెరికాకు చెందిన మూడు ఎఫ్ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు కువైట్‌లో కూలిపోయాయి. అయితే.. అది కువైట్ చేసిన పొరపాటని, అది ఫ్రెండ్లీ ఫైర్ అని అగ్రరాజ్యం ప్రకటించింది. మొత్తానికి యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యాయి. చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. దిగ్గజ సంస్థలు సైతం భారీ నష్టాలను చవిచూశాయి.

ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాధినేతలకు మోదీ కాల్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రధాని మోదీ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో సంభాషించారు. ఇజ్రాయెల్ పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ ఆయన్ను కోరారు. యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, సౌదీ అరేబియా అధినేత మహ్మద్ సల్మాన్, యూఈఏ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తోనూ మోదీ ఫోన్‌లో సంభాషించారు. ఆయా దేశాల్లో భారతీయుల క్షేమ సమాచారంపై ఆరా తీశారు. ఆయా దేశాలపై ఇరాన్ దాడుల్ని మోదీ ఖండించారు. 

అప్రమత్తంగా ఉండాలి: భారత హోంశాఖ హెచ్చరికలు

మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అన్ని రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల అల్లర్లకు ఆస్కారం ఉందని, రెచ్చగొట్టే ప్రచారాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయా ప్రభుత్వాలను హెచ్చరించింది. 

ఇరాన్‌కు చైనా మద్దతు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడిపై తాజాగా చైనా స్పందించింది. తన మిత్రదేశమైన ఇరాన్‌కు సంపూర్ణమైన మద్దతు ప్రక టించింది. అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఇరాన్ తన హక్కులను కాపాడుకో వడాన్ని చైనా సమర్థిస్తోంది. ఇరాన్ సార్వభౌమత్వం, ఆ దేశ పౌరుల భద్రతకు ఉంటామ ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్ప ష్టం చేశారు. ఈమేరకు ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రితో ఫోన్ లో మాట్లాడారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు సం తాపం తెలిపారు. 

అమెరికాకు ‘నాటో’ మద్దతు

ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధానికి ఉత్తర అట్లాంటిక్ కూటమి (నాటో) సంపూర్ణమైన మద్దతు ప్రకటించింది. ఇరాన్ నుంచి ఎదురయ్యే క్షిపణి దాడులు, డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు నాటో దేశాల తమ సైనిక బలగాలను సిద్ధం చేశాయి. అలాగే బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు సైతం అమెరికా చర్యలనే సమర్థిస్తున్నాయి. 

అమెరికాకు వ్యతిరేకంగా మా ‘జిహాద్’: ఇరాన్ మత పెద్దలు

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని, అమెరికాపై ‘జిహాద్’ ప్రారంభిస్తామని ఇరాన్ మత పెద్దలు ఫత్వా జారీ చేశారు. ఖమేనీ హత్య.. యావత్ ప్రపంచంలోని ముస్లింలపై జరిగిన మారణకాండ అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పేర్కొన్నారు.

నెతన్యాహు కార్యాలయంపై క్షిపణి దాడులు: ఇరాన్ ప్రకటన

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని తాము క్షిపణి దాడులు చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. టెల్ అవీవ్‌లోని ప్రధాని కార్యాలయంతోపాటు హైఫాలోని భద్రతా, సైనిక కేంద్రాలు, తూర్పు జెరూసలేంపైనా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డామని వెల్లడించింది. దాడులుపై ఇజ్రాయెల్ స్పందిస్తూ.. ఇరాన్ నుంచి దూసుకువస్తున్న క్షిపణులను, తమ రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు కూల్చివేస్తున్నామని ప్రకటించింది.

పెరిగిన చమురు ధరలు.. పడిపోయిన స్టాక్ మార్కెట్

మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రభావం ఇతర దేశాలపైనా పడుతున్నది. అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి నుంచి ఇరాన్ నౌకల రవాణాను అడ్డుకోవడంతో ఇంధన ధరలు 10 శాతం మేర పెరిగాయి. ఒమన్ -ఇరాన్ మధ్య ఇరుకుగా ఉండే సముద్ర మార్గమే ఈ జల సంధి. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి వివిధ దేశాలకు ఈ మార్గంలోనే చమురు వెళ్తుంది.

ప్రపంచం వినియోగిస్తున్న ఇంధనంలో ౨౦ శాతం దీని నుంచే రవాణా అవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కొనుగోలుదారుల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. యుద్ధం ప్రభావం భారత్‌పై ఉండకపోవచ్చు. ఎందుకంటే.. అంతర్జాతీయంగా భౌగోళిక -రాజకీయ ఒడుదొడుకులు ఎదురైనప్పుడు భారత ఇంధన అవసరాలను తీర్చేందుకు పెట్రోలియం నిల్వలు 74 రోజుల పాటు సరిపోతాయి. ఈలోపు యుద్ధం ముగియవచ్చు. ఒకవేళ..యుద్ధం ముగియకుండా చమురు సరఫరా ఆగిపోతే ఇంధన సంక్షోభం వచ్చినట్లే.

మరోవైపు, యుద్ధం ప్రభావం యూరప్‌పై ఎక్కువగా ఉంది. ఆయా దేశాలకు చమురు సరఫరా ఆగిపోవడంతో, ప్రస్తుతం అక్కడ గ్యాస్ ధరలు ౫౦శాతం పెరిగాయి. యుద్ధం కారణంగా భారత మార్కెట్ పతనమైంది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ కూడా 25 వేల పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ పతనం వల్ల అనేక దిగ్గజ కంపెనీలు నష్టాలు చవిచూశాయి. అలాగే, అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు: 31 మంది మృతి

హెజుబుల్లా రాకెట్ దాడులకు ప్రతిచర్యగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) లెబనాన్‌పై విరుచుకుపడింది. వెల్లడించింది. ఆ దేశ రాజధాని బీరుట్‌లోని హెజుబుల్లా కేంద్రమైన దహియే ప్రాంతాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఈ వైమానిక దాడుల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని లెబనాన్ ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయెల్ కూడా.. బీరుట్‌లో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులను, దక్షిణ లెబనాన్‌లోని పలువురు కమాండర్లను తమ సైన్యం మట్టుపెట్టినట్లు ధ్రువీకరించింది. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంపైనా ఇజ్రాయెల్ దాడులు చేసింది. మరోవైపు యుద్ధంతో తమకెలాంటి ప్రమేయం లేదని లెబనాన్ ప్రభుత్వ పరోక్షంగా ప్రకటించింది.

సౌదీ చమురు కేంద్రంపై డ్రోన్ దాడి.. నిలిచిన ఉత్పత్తి

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రమైన సౌదీ అరేబియా ‘రాస్ తనూరా’పై ఇరాన్ రెండు డ్రోన్లతో దాడి చేసింది. ఫలితంగా కేంద్రంలో చిన్నపాటి మంటలు చెలరేగాయి. దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పరిణామాల వల్ల సౌదీ అరామ్కో సంస్థ తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ కేంద్రంలో రోజుకు సుమారు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు శుద్ధి అవుతుంది.

ఇక్కడి నుంచి యూరప్, ఆసియా దేశాలకు భారీగా చమురు ఎగుమతి అవుతుంది. చమురు శుద్ధి నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరలు ఒక్క రోజే 10 శాతం పెరిగాయి. ప్రపంచ చమురు వినియోగంలో ఐదో వంతు వాటా ఉన్న హార్ముజ్ జలసంధి గుండా నౌకలు రాకపోకలు నిలిచిపోవడం కూడా చమురు ధరల పెరుగుదలపై ప్రభావం చూపింది. 

ఖమేనీ సతీమణి మన్సూరే మృతి

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజస్తే (౭౯) బాగర్జాదే కన్నుమూశారు. ఖమేనీ అధికారిక నివాసంపై ఆదివారం అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆమె తీవ్రంగా గాయపడి, కోమాలోకి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతిచెందారు. ఆమె మరణాన్ని ఇరాన్ అధికారిక ప్రభుత్వ మీడియా ధ్రువీకరించింది. ఖమేనీ, మన్సౌరే ఖోజాస్తేకు 1964లో వివాహం జరిగింది.

మన్సూరే ఖోజసే జీవితకాలం బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కుటుంబం, వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యమిచ్చేవారు. వీరికి ఆరుగురు సంతానం. కుమారులు మోస్తఫా, మోజ్తాబా, మసౌద్, మేసం. ఇద్దరు కుమార్తెలు జహ్రా హదాదా, బోష్రా. కుమార్తెల్లో ఒకరైన జహ్రా హదాదా, ఆమె భర్త, కుమారుడు ఆదివారం జరిగిన దాడిలో మృతిచెందారు. 

ఒమన్ తీరంలో పేలుడు: భారత నావికుడు మృతి

ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న ఒక చమురు నౌక ‘ఎంకెడి వ్యోమ్’పై డ్రోన్ దాడి సంభవించి ఓ భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంలో మృతిచెందిన మొదటి భారతీయుడు ఈయనే. నౌకలో మొత్తం 21 మంది సిబ్బంది ఉండగా, వీరిలో 16 మంది భారతీయులు. ప్రమాదం నుంచి బయటపడిన 20 మందిని ఒమన్ భద్రతా దళాలు సురక్షితంగా రక్షించాయి. ఆదివారమూ ఒమన్ సమీపంలో ‘స్కైలైట్’ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఘటనలో నలుగురు భారతీయ నావికులు గాయపడ్డారు.

కూలిన యుద్ధవిమానాలు.. అది కువైట్ పొరపాటు: అమెరికా

అమెరికాకు చెందిన మూడు ఎఫ్--15 స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు కువైట్‌లో కూలిపోయాయి. కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థ పొరపాటున వాటిని కూల్చివేసిందని, అది ‘ఫ్రెండ్లీ ఫైర్’ (సొంత దళాల పొరపాటు దాడి) అని అమెరికా ప్రభుత్వం అభివర్ణించింది. యుద్ధ విమానాలు కూలిపోయినప్పటికీ, ప్రమాదం నుంచి ఆరుగురు సైనికులు క్షేమంగా బయటపడ్డారని తెలిపింది. మరోవైపు, యుద్ధవిమానాలు కూలి, ఆ శకలాలు మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంలో పడి ద్దరు కార్మికులు గాయపడ్డారు. 

యుద్ధం 4 వారాలు కొనసాగొచ్చు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 

మధ్యప్రాచ్యంలో యుద్ధం సుమారు ౪౫ వారాలపాటు కొనసాగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పూర్తి స్థాయిలో కొనసాగుతున్నదని వెల్లడించారు. ‘ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ గతంలో నాపై రెండుసార్లు హత్యాయత్నాలు చేయించారు. నేను రెండుసార్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా. తర్వాత మేం ఖమేనీని లక్ష్యం చేసుకుని దాడి చేశాం. యుద్ధం కొనసాగించడం ఇజ్రాయెల్, అమెరికాకు పెద్ద కష్టమేమీ కాదు. మా సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకుని తీరుతాం. ఇరాన్ ఐఆర్జీసీ, మిలిటరీ దళాలు ఆయుధాలు వీడితే, వారికి రక్షణ కల్పిస్తాం.

ఇరాన్ అహంకారం వల్లే యుద్ధం : అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ 

మధ్యప్రాచ్యంలో భీకర యుద్ధానికి ఇరాన్ ప్రదర్శిస్తున్న అహంకార వైఖరే కారణం. అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు మేం ఇరాన్‌కు ఎన్నో అవకాశాలు ఇచ్చాం. కానీ, ఆ దేశం అహంకారంతో వాటిని తిరస్కరించింది. ఇరాన్ మొండితనం వల్లే మేం ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ప్రారంభించాల్సి వచ్చింది. 47 ఏళ్ల నుంచి ఇరాన్ పాలకులు అమెరికాపై ఏకపక్ష యుద్ధం చేస్తున్నారు. ఇరాన్ క్షిపణులను, వాటి తయారీ కేంద్రాలను పూర్తిగా నేలమట్టం చేస్తాం.

ఇతర భద్రతా వ్యవస్థలను నాశనం చేస్తాం. ఇరాన్ సైన్యం ఇప్పటికైనా ఆయుధాలను వీడాలి. లేదంటే మృత్యువు తప్పదు. మేం ఏమాత్రం వెనక్కి తగ్గం. యుద్ధంలో మాకూ నష్టం జరిగింది. ఇప్పటికే నలుగురు అమెరికన్ సైనికులు వీరమరణం పొందారు. ఈ యుద్ధం ఇరాక్ యుద్ధంలా సుదీర్ఘంగా కొనసాగదు. త్వరలోనే యుద్ధం ముగిస్తాం. యుద్ధంలో మేమే గెలుస్తాం.

ఇరాన్ అంతమే లక్ష్యం : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

ఇరాన్ ఉగ్రవాద పాలనను అంతం చేసే వరకు మా పోరాటం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. తమ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న శక్తులను నాశనం చేస్తామని హెచ్చరించారు. ఖమేనీ మరణంతో ఇరాన్ ఉగ్రవాద మూలాలు కదిలిపోయాయని వ్యాఖ్యానించారు. తన కార్యాలయంపై జరిగిన క్షిపణి దాడులపైనా స్పందించారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు తన సంకల్పాన్ని అణుమాత్రం కూడా మార్చలేవని చెప్పారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు ఇజ్రాయెల్ భయపడదని ఇరాన్‌ను ఎద్దేవా చేశారు. తమ దేశంపై దాడులకు పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. శత్రువులు ఎక్కడున్నా వేటాడి మట్టుబెడతామని హెచ్చరించారు.

చర్చల్లేవ్.. యుద్ధాన్ని మేమే ముగిస్తాం.. : ఇరాన్ భద్రతా కార్యదర్శి లారి జానీ

‘యుద్ధం ఎవరు ప్రారంభించారనేది మాకు ముఖ్యం కాదు. మేమే ఆ యుద్ధాన్ని ముగిస్తాం. అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించి ఉండవచ్చు. కానీ, ఆ యుద్ధం ఎలా ముగియాలో మాత్రం మేమే నిర్ణయిస్తాం. శత్రువుల ఇష్టప్రకారం యుద్ధం ముగియదు’ అని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ మాటపై నిలబడటం లేదని, గతంలో సీజ్‌ఫైర్ చేసినప్పుడు కాల్పుల విరమణ కోరి, ఇప్పుడు మళ్లీ వారే ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు.

ఆ దేశాధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా.. ప్రతిఘటన కొనసాగిస్తామని ప్రకటించారు. శత్రు స్థావరాలను నాశనం చేసే వరకు తమ సైన్యం విశ్రమించదని ఉద్ఘాటించారు. ఖమేనీ మరణం తర్వాత కొందరు మధ్యవర్తుల ద్వారా అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అమెరికాతో ఎలాంటి చర్చలు ఉండబోవని తేల్చిచెప్పారు.