మహిళా సాధికారతకు కుట్టు మిషన్ల పంపిణీ అభినందనీయం
నగర మేయర్ కొలగాని శ్రీనివాస్
ముకరంపుర,ఆగస్టు5(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని 12వ డివిజన్ రామచంద్రపూర్ కాలనీ అభయ మహిళా సాధికార కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అభయ మహిళా సాధికార కేంద్రం మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ అందించి, అనంతరం ఉచితంగా కుట్టు మిషన్ల ను పంపిణీ చేశారు.
నగర మేయర్ మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసి, వారి స్వయం ఉపాధి మరియు ఆర్థిక స్వావలంబనకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మహిళా సాధికారతకు సేవలందిస్తున్న అభయ మహిళా సాధికార కేంద్రం నిర్వాహకులను మేయర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి చొప్పరి జయశ్రీ వేణు, అభయ మహిళా సాధికార కేంద్రం నిర్వాహకులు బాలచంద్ర స్వామీజీ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






