మొండికుంటలో వైద్య శిబిరం.. సీజనల్ వ్యాధులపై అవగాహన
05-08-2026 01:05 PM
అశ్వాపురం, ఆగస్టు 5 (విజయక్రాంతి): అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మొండికుంట గ్రామంలో బుధవారం రొటీన్ ఇమ్యునైజేషన్ (RI) సెషన్‌తో పాటు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఎన్‌సీడీ (మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక వ్యాధులు) స్క్రీనింగ్ ఫాలోఅప్ సేవలు అందించారు. అలాగే సీజనల్ వ్యాధుల నివారణ, పోషకాహారం ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని అశ్వాపురం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఏఏఎం మొండికుంట, ఎంఎల్‌హెచ్‌పీ ఈ. దేవి నిర్వహించారు.






