8 August, 2026 | 5:55 PM

తప్పిన పెనుముప్పు.. 3 గంటలు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం

20-06-2024 12:26 PM

హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి గురువారం తెల్లవారుజామున బయలుదేరిన హైదరాబాద్-కౌలాలంపూర్ మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి పెనుముప్పు తప్పింది. విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం, 130 మంది ప్రయాణికులు, 20 మంది సిబ్బందితో కూడిన ఎంహెచ్ 199 విమానం అర్ధరాత్రి 12.45 గంటలకు హైదరాబాద్ నుంచి విమానం టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే విమానం కుడివైపు ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. తక్షణమే ఏటీసీ అధికారులను ల్యాండింగ్ కి పైలట్ అనుమతి కోరాడు. నేరుగా కౌలాలంపూర్ వెళ్తుండడంతో అధికారులు పెద్దమొత్తంలో ఇంధనం నింపారు. ఇంధనం అధికంగా ఉండడంతో ల్యాండింగ్ లో మంటలు వచ్చినట్లు గుర్తించారు. దాదాపు 3 గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టి విమానం ల్యాండ్ అయింది. మలేషియా ఎయిర్ లైన్స్ విమానాన్ని ఏటీసీ సేఫ్ గా ల్యాండ్ చేయించింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.