8 August, 2026 | 7:17 PM

కల్తీ మద్యం ఘటన.. 35కు చేరిన మృతుల సంఖ్య

20-06-2024 11:49 AM

చెన్నై: తమిళనాడులో మరోసారి కల్తీ మద్యం కాటేసింది. కల్లకురిచి, సేలం జిల్లాల్లో బుధవారం నాటు సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 35కి చేరింది. మరికొంత మందిబాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తమిళనాడులో పెను సంచలనం రేపిన సాటు సారా ఘటనపై సిబి-సిఐడి (క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్) విచారణకు సీఎం స్టాలిన్ ఆదేశించారు. కల్లకురిచి జిల్లా కలెక్టర్ పై బదిలీ వేటు, ఎస్పీని సస్పెండ్ చేసింది. కళ్లకురిచిలోని కరుణాపురం కాలనీకి చెందిన దాదాపు 70 మంది పురుషులు, ఎక్కువగా రోజువారీ కూలీ కార్మికులు, ప్యాకెట్లలో విక్రయించే నకిలీ మద్యాన్ని సేవించినట్లు సమాచారం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను సేలం, తిరువణ్ణామలై, పుదుచ్చేరిలోని ఆసుపత్రులకు తరలించారు. కల్తీ మద్యం తయారీ, విక్రయాలకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.