8 August, 2026 | 6:48 PM

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

08-08-2026 05:31 PM

వరంగల్,(విజయక్రాంతి): దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని వరంగల్ నగరానికి చెందిన బి ఆర్ ఎస్ నేతలు పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు 2001 నుండి మరణం ముందు వరకు తమకు పెద్ది సుదర్శన్ రెడ్డి తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేస్తూ పెద్ది మరణం బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని, పెద్ది సుదర్శన్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు మాతో ఎన్నో ఉద్యమాలు, రైల్ రోకో కార్యక్రమాలు మాతో చేయించేవాడని గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్, అర్బన్ జిల్లా నాయకులు శిరుమల్ల దశరథం, ఎండి అఫ్జల్, ఎండి హుస్సేన్ జానీ, పోలేపల్లి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.