8 August, 2026 | 6:59 PM

తూప్రాన్‌ ఖో-ఖో క్రీడా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి

08-08-2026 05:42 PM

తూప్రాన్,(విజయక్రాంతి): శనివారం తూప్రాన్‌ లోని ఒలింపియా స్కూల్‌ లో నిర్వహించిన ఖో-ఖో క్రీడా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్టీజోన్–I ఐజీ. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడి, క్రీడల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఐజీ టోల్ ప్లాజా వద్ద ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి, నేషనల్ హైవే 44 జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను పరిశీలించారు. హైవేపై ట్రాఫిక్ నియంత్రణ, కీలక ప్రాంతాల పర్యవేక్షణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా తదితర అంశాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు, ఐపీఎస్, మెదక్ అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్, ఐపీఎస్, తూప్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్, తూప్రాన్ సీఐ, తూప్రాన్ ఎస్‌ఐ, తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.