18 August, 2026 | 2:13 AM

ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ

18-08-2026 12:00 AM

ఆదిలాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు అధికంగా తరలి రాగా ఫిర్యాదులను అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్‌ఎస్ చిత్రులు స్వీకరించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుం డా అత్యంత ప్రాధాన్యతతో నిర్ణీత గడువు లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పింఛన్లు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు

, భూమికి సంబంధించిన సమస్యలపైనే అధికంగా వినతులు నమోదయ్యాయని, అందిన అర్జీలను వెంటనే సంబంధిత శాఖలకు పంపించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ స్రవంతి, డిఆర్డిఏ రవీందర్ రాథోడ్, ఏవో వర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.