4 August, 2026 | 1:39 PM

Breaking News

ఇళ్లలోకి వరద నీరు

04-08-2026 12:52 PM

అవస్థల్లో కాంట్రాక్ట్స్ కాలనీ వాసులు 

పాల్వంచ,(విజయక్రాంతి): వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని కాంట్రాక్ట్ కాలనీలో వరద నీరు ఇండ్లలో ప్రవేశించి ప్రజలను ఇబ్బందులు పాలు చేసింది. రాత్రి కురిసిన భారీ వర్షాలకు వర్షపు నీరంతా రోడ్ల పైన, ఇండ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా అస్తవ్యస్త డ్రైవేజీ కారణంగా వరద నీరు ప్రవహిస్తుందని  మున్సిపల్ కార్పొరేషన్ లో పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం అని కాలనీవాసులు వాపోతున్నారు. కాంట్రాక్ట్స్ కాలనీలోనే వరద నీటి సమస్యను అత్యవసరంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపవాలని డిమాండ్ చేస్తున్నారు