4 August, 2026 | 2:18 PM

Breaking News

హైదరాబాద్‌లో పలుచోట్ల హెచ్-ఫాస్ట్ అధికారుల తనిఖీలు   •   ప్రజల్లో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై చైతన్యం పెంచాలి   •   మృతుడి కుటుంబానికి మాజీ సుడా చైర్మన్ పరామర్శ   •   విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాల పెంపుపై దృష్టి   •   విమాన ప్రయాణీకుల భద్రతపై తీసుకుంటున్న చర్యలేంటీ?   •   ఓటరు జాబితా సవరణలో నర్సాపూర్ ఆదర్శంగా నిలవాలి   •   ఏటీసీ సెంటర్ కు భూమిపూజ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్   •   34.10 టి.ఎం.సి.లకు చేరిన ఎస్సారెస్పీ నీటి మట్టం   •   ఐదవ వార్డులో నూతన విద్యుత్ స్తంభాలు, వైర్లు ఏర్పాటు   •   రాహుల్ గాంధీకి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన జుక్కల్ ఎమ్మెల్యే   •  

విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాల పెంపుపై దృష్టి

04-08-2026 01:12 PM

- బీవీఆర్ఐటీలో ఘనంగా 30వ ఇండక్షన్ డే

నర్సాపూర్: నర్సాపూర్‌లోని బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ)లో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 30వ ఇండక్షన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు కె. విష్ణు రాజు విద్యార్థులను కళాశాల కుటుంబంలోకి ఆహ్వానిస్తూ, సోషల్ మీడియా, ఏఐ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, సాంకేతిక నైపుణ్యాలతో పాటు విలువలతో కూడిన విద్యను అలవరచుకోవాలని సూచించారు.

వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్ పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించగా, ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే బీవీఆర్ఐటీ ప్లేస్‌మెంట్లు, పరిశోధన, జాతీయ స్థాయి విజయాలను వివరించారు. డైరెక్టర్ డా. కె. లక్ష్మీ ప్రసాద్ ఏడు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమం లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పుస్తకాలతో సత్కరించి, నూతన విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు.