4 August, 2026 | 2:14 PM

Breaking News

మృతుడి కుటుంబానికి మాజీ సుడా చైర్మన్ పరామర్శ

04-08-2026 01:14 PM

ఇర్కోడ్‌లో బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం

సిద్దిపేట రూరల్: ఇర్కోడ్ గ్రామానికి చెందిన మహ్మద్ అబీబ్ (50) అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అబీబ్ నివాసానికి వెళ్లి ఆయన తల్లి రసూలమ్మ, భార్య, కుమారుడు సాదిక్, కుమార్తె, అల్లుడు సల్మాన్‌ను ఓదార్చి మనోధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మహ్మద్ అబీబ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందారు. అనంతరం స్వగ్రామానికి తిరిగి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఆరోగ్యం విషమించి మృతి చెందారు.