4 August, 2026 | 1:39 PM

Breaking News

ఐదవ వార్డులో నూతన విద్యుత్ స్తంభాలు, వైర్లు ఏర్పాటు

04-08-2026 01:00 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ 5వ వార్డులో కౌన్సిలర్ మేష పోసాని సతీష్ ఆధ్వర్యంలో నూతన విద్యుత్ స్తంభాలు వైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ఏళ్లుగా కాలనీలో విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతుండగా ప్రమాదకరంగా మారిన వాటిని మార్చి నూతన స్తంభాలు వైర్లు ఏర్పాటు చేయించామని కౌన్సిలర్ పోసమ్మ సతీష్ తెలిపారు. కాలనీలో ఎటువంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.