27 June, 2026 | 7:08 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

లక్ష మల్లెపూలతో ఉప్పలమ్మ తల్లికి పూలాభిషేకం

16-03-2026 12:00 AM

జనగామ, మార్చి 15 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ ఉప్పలమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి లక్ష మల్లెపూలతో ఘనంగా పూలాభిషేకం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో అ మ్మవారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం మహిళలు కలిసి విష్ణు లలిత సహస్రనామాలను పారాయణం చేశారు.

తదనంతరం అమ్మవారికి సమర్పించిన పూలు, పండ్లు మరియు నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. మహిళలు అధిక సంఖ్యలో బోనం ఎత్తుకుని వచ్చి ఉప్పలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ అయ్యగారు పవన్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తి వాతావరణం లో జరిగింది.