24 June, 2026 | 2:44 PM

Breaking News

బుధవారంపేటలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం   •   జోరుగా జీరోలో చల్లని పానీయ వ్యాపారం   •   అర్హులైన పేదలందరికీ ఇళ్లు   •   రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •  

కూల్చడంపైనే శ్రద్ధ.. వైద్యంపై లేదు

04-03-2026 12:00 AM
  1. ఎంపీ డీకే అరుణ 
  2. కొత్త భవనం ఎందుకు ప్రారంభించలేదు
  3. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): పేదల ఇండ్లను కూల్చడంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ పేద ప్రజలకు వైద్యం అందించడంలో లేదని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. జడ్చర్ల ప్రభుత్వ ఆ సుపత్రి మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం ప్రకటనను విడుదల చేశారు.

అధికారుల నిర్లక్ష్యం పై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న చోటనే పరిస్థితి ఇలా ఉంటే ఇతర జిల్లాల సంగతి ఏమిటని ఆమె ప్రశ్నించారు.  ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే శవాన్ని కుక్కలు పిక్క తిన్నాయని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం జడ్చర్ల ఆసుపత్రిని ఆయన పరిశీలించారు.

బీఆర్‌ఎస్ హయాంలోనే నూతన మార్చురీని నిర్మించామని, ఆ భవనాన్ని ప్రారంభి ంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే ఈ ఘటన జరిగిందని అన్నారు. నిరుపేదలకు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా చేస్తుం దని ఇది ఎంతవరకు సమంజసం అని ప్ర శ్నించారు. ముమ్మాటికి ఇది ప్రభుత్వ తప్పిదమైనని, పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహిం చాలని డిమాండ్ చేశారు.