4 March, 2026 | 6:18 AM

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

04-03-2026 12:00 AM

ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే శవాన్ని కుక్కలు పిక్కతిన్నాయని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. మం గళవారం జడ్చ ర్ల ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే నూతన మార్చురీని నిర్మించామని, ఆ భవనాన్ని ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే ఈ ఘటన జరిగిందని అన్నారు. నిరుపేదలకు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా చేస్తుందని ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ముమ్మాటికి ఇది ప్రభుత్వ తప్పిదమైనని, పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.