20 August, 2026 | 6:56 PM

వామన్ రావు హత్య కేసులో బిగ్ ట్విస్ట్

20-08-2026 06:55 PM

పుట్ట మధును విచారణ కోసం పిలిపించిన సీబీఐ?

మంథనిలో తీవ్ర ఉత్కంఠ!

మంథని,(విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పుట్ట మధును సీబీఐ అధికారులు గురువారం మళ్లీ విచారణ కోసం పిలిచినట్లు సమాచారం. 

గతంలో ఈ కేసుకు సంబంధించి పుట్ట మధు భార్య పుట్ట శైలజను సీబీఐ అధికారులు లోతుగా విచారించడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ పరిణామం మరువకముందే, తాజాగా పుట్ట మధును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారిస్తున్నట్లు వార్తలు వెలువడటంతో మంథని నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.