calender_icon.png 7 June, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోంగార్డుల ఆరోగ్య భద్రతపై దృష్టి

04-06-2025 12:00:00 AM

ఆరోగ్య భద్రత కార్డులు అందజేసిన ఎస్పీ అఖిల్

అదిలాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): పోలీసు వ్యవస్థలో విధులు నిర్వర్తించే హోం గార్డుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక సారించడం జరుగుతోందని  ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.  ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌లో ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రైవేటు వైద్యుల సహకారంతో జిల్లాలో మొట్టమొదటి సారిగా హోంగార్డులకు ఆరోగ్య భద్రతా నేపథ్యంలో స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ హోంగార్డులకు ఆరోగ్య భద్రత కార్డులను మంగళవారం అందజేయ డం జరిగింది.

ఈ ఆరోగ్య భద్రత పథకంలో జిల్లాలోని 240 హోంగార్డులకు, వారి కుటుంబ సభ్యులకు జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులలోని కార్పొరేట్ వైద్యం వీలైనం త వరకు రాయితీలో లభించనుందని ఎస్పీ తెలిపారు. లబ్ధి పొందనున్న హోంగార్డులలో 40 మంది మహిళ హోంగార్డు సిబ్బంది మిగిలినవారు పురుష హోంగార్డ్ సిబ్బంది ఉన్నారని, ముఖ్యంగా ఓపి సేవలను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిన జిల్లా ప్రైవేటు ఆసుపత్రి వైద్యులకు జిల్లా ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

పోలీసు వ్యవస్థలో హోంగార్డులు అతి తక్కు వ జీతంతో నిత్యం పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ ఉంటారని, వారు తమ ఆరోగ్యం పట్ల, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాల పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండాలని జిల్లా ఎస్పీ తెలిపారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి జిల్లా హోంగార్డులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఏస్పీ కాజల్‌సింగ్, సీసీ కొండ రాజు, హోంగార్డు ఆర్.ఐ చంద్రశేఖర్, జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ రమేష్, హోంగార్డు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.