11-08-2025 01:00:21 AM
- ఈ నెల 14 పూలే మైదానంలో సభ
- అన్ని తానైన మాజీమంత్రి ఎమ్మెల్యే గంగుల
కరీంనగర్, ఆగస్టు 10(విజయక్రాంతి): రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉండాల్సిందే అనే డిమాండ్‌తో బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, అప్పటి వరకు ఎన్నికల తెరువుకు పోవద్దన్న డిమాం డ్‌తో కరీంనగర్‌లో ఈ నెల 14న బీసీ గర్జన పేరుతో బీఆర్‌ఎస్ పార్టీ భారీ సభ నిర్వహించనున్నది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కల్పించకుండా కుటిల రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడం కోసం రాష్ట్రవ్యాప్తంగా బీసీల సత్తా చాటేందుకి ఉద్యమాల గడ్డ కరీంనగర్ ను ఎంచుకున్నారు.
తొలుత ఈ నెల 8 న నిర్వహించాలనుకొని వివిధ కారణలచేత 14 కు వాయిదా వేశారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పెద్దన్న గా బి సి నేతలతో స మావేశం అవుతుండగా మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క రీంనగర్ లో మకాం వేసి అన్ని తానై ఏర్పా ట్లు చేస్తున్నారు. పూలే మైదానంలో ఏర్పాట్ల ను ఎప్పటికప్పుడు స్థానిక నేతలతో సమావేశం అవుతున్నారు.కాంగ్రెస్ ద్రోహానికి పరా కాష్ట బీసీలకు రిజర్వేషన్లు కల్పించక పోవ డం, కాంగ్రెస్ ద్రోహానికి పరాకాష్ట అని బి ఆర్ ఎస్ బి సి నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు ఢిల్లీ ధర్నాలో ఇండియా కూటమిని ఏకం చేస్తామని అన్నారని, మరి ఆ కూటమి సభ్యులు ధర్నాకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీసీల జపం చేసే రాహుల్గాంధీ బీసీ ధర్నాకు ఎందుకు రాలేదని నిలదీస్తున్నారు.
బీసీల సత్తా చాటి చెప్తాంకాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించకుంటే బీసీల సత్తా ఏమిటో చాటి చెప్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే గం గుల కమలాకర్ హెచ్చరించారు. ఢిల్లీ ధర్నా కు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే ఎం దుకు రాలేదని ప్రశ్నించారు.ఆర్డినెన్స్లో చేర్చిం ది రాజకీయ రిజర్వేషన్లే రేవంత్ ప్రభుత్వం గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ కాపీలో చేర్చింది రాజకీయ రిజర్వేషన్ల అంశం మాత్రమేనని, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం అందులో లేనేలేదని విమర్శించారు. కరీంనగర్ గర్జన ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చేలా గర్జిస్తామనిఅన్నారు.