13-08-2025 09:20:07 AM
నాగార్జునసాగర్, విజయక్రాంతి: నాగార్జున సాగర్(Nagarjuna Sagar) కు కృష్ణమ్మ పోటెత్తుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. దీంతో అధికారులు 24 క్రస్ట్ గేట్లను ఎత్తారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నాగార్జునసాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది.నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుంది. రెండు లక్షల పై చిలుకు క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తుంది. నాగార్జున సాగర్ జలాశయం 24 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి 1,92 ,649 క్యూసెక్కుల నీటిని స్పిల్ వే నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం
ఇన్ ఫ్లో, 1,74,533 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 2,33,051 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి మట్టం :590 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 589.30
పూర్తి స్థాయి సామర్ధ్యం : 312.0450 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 309.95 టీఎంసీలుగా ఉంది.