13-08-2025 11:06:19 AM
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో మంగళవారం రాత్రి ఎనిమిది సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి బుధవారం నగరంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగరంలోని లోతట్టు ప్రాంతాలను ప్రాంతాలను మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి ముంపుకు గురికాకుండా తాత్కాలిక పరిష్కారం కోసం పలు సూచనలు చేశారు.