9 May, 2026 | 8:15 AM

లాభాల సాగుపై దృష్టి సారించాలి

09-05-2026 12:00 AM

వ్యవసాయ శాఖ కమిషనరేట్ జెడీఏ సుచరిత

మంచిర్యాల, మే 8’(విజయక్రాంతి) : వ్యవసాయంలో లాభాలు వచ్చే సాగువైపు రైతులు దృష్టి సారించాలని, ఆధునిక సాగు పద్దతులతో ఖర్చును తగ్గించుకోవచ్చునని రాష్ట్ర వ్యవసాయ కమీషనర్ కార్యాలయ జేడీఏ సుచరిత అన్నారు. ప్రజా పాలనా - ప్రగతి ప్రణాళిక ‘రైతు వారోత్సవాల’లో భాగంగా శుక్ర వారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ మండలం సీతారాంపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రైతులనుద్దేశించి మాట్లాడారు.

వ్యవసాయ శాఖలో పథకాలు, మట్టి పరీక్షలు, సాయిల్ హెల్త్ కార్డ్ ల ప్రాముఖ్యత, సమగ్ర వ్యవసాయ విధానాలపైన అవగాహన కల్పించారు. వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా అందించే సబ్సిడీ పథకాలు, శాఖ కార్యక్రమాలు, మత్స్యశాఖ పథకాలపై వివరించారు. ప్రభుత్వం ద్వారా అమలు చేసే పథకాలను మహిళలు, మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేపల ఉత్పత్తి పెంచాలని, ముర్రెల్ క్లస్టర్ ద్వారా మత్స్యకారులు లాభపడతారని సూచించారు.

ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ అవినాష్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, మంచిర్యాల ఏడీఏ మామిడి కృష్ణ, ఫ్యాకల్టీ నరేష్, మండల వ్యవసాయఈ అధికారి మహేందర్, ఏడీఏ కార్యాలయ ఏఓ రజిత, పశు సంవర్థక శాఖ అధికారి తిరుపతి, హార్టికల్చర్ అధికారి సహజ, మందమర్రి ఏఈఓ ముత్యం తిరుపతి, సంధ్య, ఏఎంసీ డైరెక్టర్ లు మల్లేష్, లింగయ్య, ఆత్మ డైరెక్టర్ మోహన్ రావు, మంచిర్యాల, మందమర్రి, నస్పూర్ మండలాల రైతులు, బెస్త సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.