కమ్ముకున్న మంచు దుప్పటి
08-12-2024 01:04 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో పొగ మంచు ముసురేసుకుంది. ఉదయం 8గంటలు దాటినా రోడ్డు మార్గం పొగ మంచి తగ్గలేదు. వీధులతో పాటు రహదారి గుండా 10 అడుగుల మేర ఎదురుగా వచ్చే మనుషులు సైతం కనిపించనంతగా మంచు కురిసింది. దీంతో హెడ్లైట్లు వేసుకున్నా రహదారులు కనిపించక వాహనదారులు అవస్థలు ఎదుర్కొన్నారు. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వృద్ధులు బయటకు రాలేకపోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల తో అక్కడక్కడ వర్షాలు కురవడం తో పాటు తీవ్రమైన మంచు కురవడంతో పంటలకు సైతం నష్టం కలుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




