14 April, 2026 | 2:53 AM

బైక్-లారీ ఢీ.. ఇద్దరు దుర్మరణం

08-12-2024 03:44 PM

అశ్వారావుపేట,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని తల్లాడ --దేవరపల్లి జాతీయ రహదారి పై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మండల పరిధిలోని నారాంవారిగూడెం కాలని సమీపం లోని కోళ్ల ఫారం వద్ద,    అశ్వారావుపేట నుండి నారంవరిగూడెంకు ద్విచక్ర వాహనం పై వెళ్తున్న ముగ్గురు వక్తులను, సత్తుపల్లి వైపు నుండి అశ్వారావుపేట కు వస్తున్న లారీ అతి వేగంతో, మరో లారీని ఓవర్ టెక్ చేసే  సమయంలో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ప్రమాదం లో ఆంధ్ర ప్రదేశ్ జీలుగుమిల్లి మండలం ఆంకంపాలెం గ్రామానికి చెందిన బత్తుల మనోజ్ (28), అశ్వారావుపేట మండలం పాపిడీగూడెం కు చెందిన బద్దె వెంకటేశ్వరరావు (58) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.  అంకంపాలెంకు చెందిన మరో యువకుడికి తీవ్ర గాయాల పాలు కావడం తో మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ఆసుపత్రి కి తరలించారు. ముగ్గురు వ్యక్తులు వ్యవసాయ పనులు చేసేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, రెండు మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.